ఐలమ్మ చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు
SDPT: గజ్వేల్ చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా సబ్బుబిళ్ళ మీద రామకోటి సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఐలమ్మ చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరురాలు ఐలమ్మ అని, ప్రతి ఒక్కరూ అమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.