VIDEO: ఎస్సీ, ఎస్టీ కేసును విచారించిన డీఎస్పీ
MHBD: తొర్రూరు మండల కేంద్రానికి చెందిన వేర్పుల మహేష్ అనే వ్యక్తిని సీపీఎం పార్టీ మండల నాయకుడు కొమ్మనబోయిన యాకయ్య దంపతులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన ఘటనలో తొర్రూరు PSలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గురువారం తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో విచారణ చేసి సాక్ష్యాధారాలను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.