గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సెప్టిక్ ట్యాంకులు నిండడంతో ఇబ్బంది ఉందని కలెక్టర్‌కు అధికారులు సూచించారు. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.