'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

PLD: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రసాద్ శనివారం తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరాలతో ప్రతిరోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, రక్త పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.