రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ప్రకాశం: త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, DCM లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బాల రంగయ్య (30) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.