చెరువును తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాల

MDK: శివంపేట మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల వద్ద వర్షపు నీరు చేరింది. పాఠశాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. జేసీబీ సహాయంతో వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.