'మహిళల భద్రతపై కూటమి వైఫల్యం'
సత్యసాయి: రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని హిందూపురం వైసీపీ సీనియర్ నేత మధుమతి రెడ్డి విమర్శించారు. రైల్వేకోడూరులో జనసేన ఎమ్మెల్యే వేధిస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలిపై హత్యాయత్నం జరగడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలకే పరిమితయ్యారన్నారు. కానీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.