'బీసీల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి'
ఖమ్మం: M.V పాలెంలో బీసీల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని బీసీ నాయకులు వెంకన్న, నేరెళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఇవాళ బీసీ కులాల సంఘం నాయకులు మండల తహసీల్ధార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతునన్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.