VIDEO: రెండు వరిగడ్డి వాములు దగ్ధం
GNTR: ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు గ్రామంలో శుక్రవారం రెండు వరిగడ్డి వాములు మంటలలో దగ్ధమయ్యాయి. గ్రామ వీఆర్వో గురవయ్య వివరాల ప్రకారం.. వాములపై ఉన్న విద్యుత్ తీగల నుంచి నిప్పు రవ్వలు పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు ,ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో దగ్ధమైన రెండు వాముల విలువ సుమారు లక్ష రూపాయలు అని తెలిపారు.