చిన్న పంచాయతీలు.. ఓటర్ల అయోమయం
KMM: చిన్న పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పార్టీ గుర్తులు లేకపోవడం, ఒక్కో పదవికి పదుల సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఏకంగా 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండటం పోటీ తీవ్రతకు నిదర్శనం. ఈ నెల 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది.