VIDEO: ఎమ్మిగనూరు మండలంలో ఆగని వలసలు
KRNL: ఎమ్మిగనూరు మండల పరిధిలోని కందనాతి, కడివెళ్ళ, కారుమంచి గ్రామాల్లో వలసలు ఆగడంలేదు. కూలీ పనులు లేకపోవడం, పంటలు వర్షాలతో తీవ్రంగా దెబ్బతినడం వల్ల దాదాపు 20 కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా పత్తి, వేరుశనగ, టమోటా పంటలతో రైతు ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు.