డుంబ్రిగూడ శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

డుంబ్రిగూడ శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

ASR: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం డుంబ్రిగూడ మండల పరిధిలోని శివాలయాల్లో భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. అరకు, కురిడి, కించుమండ, కోసంగి, చాపరాయి సమీపంలో ఉన్న శివాలయాలకు భక్తులు వేకువజామునే చేరుకున్నారు. స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తి శ్రద్ధల నడుమ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.