సైడ్ కాలువల నిర్మాణం వేగంగా చేపట్టాలి: మేయర్

సైడ్ కాలువల నిర్మాణం వేగంగా చేపట్టాలి: మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో వర్షపు నీరు నిలిచిపోకుండా సజావుగా ప్రవహించేలా సైడ్ కాలువల నిర్మాణం వేగంగా చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం 28వ డివిజన్, సంతోషిమాత కాలనీ ఫేజ్-2, పోతన నగర్ స్మశానవాటిక ప్రాంతాలను మేయర్ పరిశీలించారు. సమస్యలు త్వరగా పరిష్కరించి, పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.