సోషల్ మీడియాపై నిఘా: ఎస్పీ
WNP: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సునీత రెడ్డి పోలీసులను ఆదేశించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌తో సహా ఇతర మాధ్యమాలలో వ్యక్తులను, పార్టీలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఓ ప్రకటనలో హెచ్చరించారు. గ్రూపు అడ్మిన్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.