నిత్య పూజయ్య స్వామి కోనకు భక్తులు రావద్దు: ఈవో
KDP: రెండు రోజులు పాటు భారీ వర్షాల కారణంగా నేడు నిత్య పూజ అయ్య కొనలో జరిగే తొలి కార్తీక సోమవారానికి భక్తులు రాకుండా వాయిదా వేసుకోవాలని ఆలయ ఈవో శ్రీధర్ సూచించారు. కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా నిత్యపూజయ్య కోనకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, రహదారిపై మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలి వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని ఈవో తెలిపారు.