మరువాడలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

మరువాడలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

VZM: బొండపల్లి మండలం మరువాడ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ప్రియ నీలంకు స్క్రబ్ టైపస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో బుధవారం ఆ గ్రామ సర్పంచ్ డోకుల పార్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కాలువల్లో పూడికలు తీయించడంతో పాటు బ్లీచింగ్ చల్లించారు. అన్ని వీధులను పరిశుభ్రం చేశారు. దీంతో వైద్య బృందం అప్రమత్తమయ్యారు.