చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
AP: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స తీసుకోవాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 10న ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కాగా, ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి జైల్లో ఉన్నారు.