'స్వీయ గణనపై విస్తృత అవగాహన కల్పించాలి'
VZM: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఇవాళ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.