కనులవిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

కనులవిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు.