ఏప్రిల్ వస్తోంది.. జర జాగ్రత్త..!

ఏప్రిల్ వస్తోంది.. జర జాగ్రత్త..!

HYDలో వేసవి తీవ్రత పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని హెచ్చరించారు.