చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! 

చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! 

యూఏఈ తూర్పు తీరంలో ఉన్న ఓ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. ఫుజైరా సమీపంలోని ఒమన్ గల్ఫ్‌లో ఆ నౌక ఉన్నట్లు వెల్లడించింది. ట్యాంకర్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఇరాన్ ఈ క్షిపణి దాడికి పాల్పడినట్లు యూఏఈ అనుమానిస్తోంది. ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.