సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల అడ్వైజరీ

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల అడ్వైజరీ

RR: నగరవ్యాప్తంగా ఈరోజు సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు మ.3 గంటల నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు. విడతల వారీగా లాగౌట్స్ చేస్తే నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించగలమన్నారు. అదే విధంగా సాయంత్రం వేళల్లో అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.