టీఎల్ఎం మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: చిన్నచింతకుంటలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాలో బుధవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని విమర్శించారు. మేళాలో విద్యార్థులు తయారు చేసిన టీఎల్ఎంలను ఆయన పరిశీలించారు.