వందేభారత్ ప్రయాణికుడి భోజనంలో పురుగులు

వందేభారత్ ప్రయాణికుడి భోజనంలో పురుగులు

అహ్మదాబాద్-ముంబై వందే భారత్ రైలులో వడ్డించిన భోజనంలో పురుగులు రావడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నెట్టింట ఫోటోలు వైరల్ కావడంతో IRCTC వేగంగా స్పందించింది. ఆహార భద్రతా లోపాలపై తీవ్రంగా పరిగణించి, సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా, కాంట్రాక్ట్ రద్దు నోటీసు ఇచ్చి, సంబంధిత వంటగదిని సీల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.