బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
NRPT: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం జాతర పోస్టర్లను మంత్రి వాకిటి శ్రీహరి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులతో మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.