6.30 నుంచే పెన్షన్ల పంపిణీ: తిరుపతి కలెక్టర్
TPT: తిరుపతి జిల్లాలో శనివారం ఉదయం 6.30కే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 7 గంటలకు 100 శాతం సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పునః పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులు, అప్పీలు చేసుకోని వారికి కూడా ఈనెల పింఛన్ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.