'కూటమి ప్రభుత్వంతో పంచాయతీరాజ్ వ్యవస్థ అస్తవ్యస్తం'

NLR: ఆత్మకూరు వైసీపీ నేతలు ఆదివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను గల్లంతు చేస్తున్నదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను తమ లాభాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. సచివాలయ కార్యదర్శులకు పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు తక్షణమే మారాలని డిమాండ్ చేశారు.