భార్యను చంపిన భర్త అరెస్ట్
SRPT: మద్యం మత్తులో తాగడానికి డబ్బులు కోసం కర్రతో కిరాతకంగా భార్యని చంపిన భర్తను మోతే పోలీసులు అరెస్ట్ చేశారు. మోతే పోలీస్ స్టేషన్‌లో సీఐ రామకృష్ణారెడ్డి వివరాలు తెలిపారు. విబులాపురంకు చెందిన బందేల్లి భార్య కరీంభినీ తాగేందుకు డబ్బులు కోసం వేధించగా ఆమె నిరాకరించడంతో కర్రతో దాడి చెయ్యడంతో మృతి చెందింది. కాగా నిందుతుడిని పోలీసులు ఇవాళ రీమాండ్‌కు తరలించారు.