జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం నియమించింది. మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడు బడేటిని మాజీ టీడీపీ అధ్యక్షుడు, ఏపీ అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన సూచించారు.