ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ

CTR: పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.