VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ఖమ్మం కొత్త బస్ స్టాండ్ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ, బస్‌ను ఢీకొని పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లి మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రుపాలెం మండలం కొత్తపల్లికి చెందిన గోపాలకృష్ణ (21), బోనకల్ మండలం తూటికుంట్లకు చెందిన ఉపేందర్ (35) మృతి చెందారు.