డ్రైనేజీ, చెత్తపై తిరుపతిలో ఫిర్యాదులు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు అందాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. 24 మంది ప్రత్యక్షంగా,12 మంది ఫోన్ ద్వారా సమస్యలు వెల్లడించారు. డ్రైనేజీ, చెత్త పాయింట్లు, పార్కు అభివృద్ధి, రోడ్ల గుంతలు, దోమల నివారణ వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. అధికారులను త్వరగా పరిష్కరించేందుకు ఆదేశించారు.