పేద విద్యార్థులకు అండగా సింహవాహిని ఫౌండేషన్

సంగారెడ్డి: చందానగర్‌లోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఆరాధ్యకు సింహవాహిని ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. ఫౌండేషన్ తరఫున రూ. 12,000 విలువ గల పుస్తకాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు వంశిరెడ్డి మాట్లాడుతూ.. పేద పిల్లల చదువు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఎల్లప్పుడూ తోడుంటాం అని తెలిపారు.