వనదేవతలను దర్శించుకున్న మందకృష్ణ మాదిగ

వనదేవతలను దర్శించుకున్న మందకృష్ణ మాదిగ

MGL: గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలకు ఈ జాతర ప్రతీక అని తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొనాలని ఆకాంక్షిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.