విజేతగా నిలిచిన కర్నూలు జట్టు

KRNL: హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఆగస్టు 2, 3 తేదీలలో జరిగిన ఇన్విటేషనల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్‌లో కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి రుద్రా రెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 20 జట్లు పోటీలో పాల్గొన్నాయని, కర్నూలు క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శననిచ్చారని పేర్కొన్నారు.