నందవరం కూడలి సమీపంలో రోడ్డు ప్రమాదం

NLR: మర్రిపాడు మండలం, నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నందవరం కూడలి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డొచ్చిన ఓ కుక్కను తప్పించబోయి స్కూటీ బోల్తా పడింది. దీంతో స్కూటీపై ఉన్న ఓ వ్యక్తితో పాటు మహిళకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.