పులివెందుల బండ లాగుడు పోటీలు ప్రారంభం
KDP:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పులివెందుల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొనగవేశ్వర స్వామి ఆలయంలో పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పగిరి పాఠశాల కరస్పాండెంట్ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలను ప్రారంభించారు.ప్రజలు పాల్గొని వీక్షిస్తున్నారు.