రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమం ఈనెల 17న యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజా బాబు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల, సచివాలయ కార్యాలయాల్లో సమర్పించవచ్చని సూచించారు.నేరుగా రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అక్కడే తమ ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చన్నారు.