154 మొబైల్ ఫోన్ల రికవరీ

KMR: జిల్లాలో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ద్వారా 154 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్ల రికవరీ కోసం ఇన్స్‌పెక్టర్ సాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్సై, 12 మంది కానిస్టేబుల్స్‌తో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 7 రోజులలో 154 ఫోన్లను రికవరీ చేశారు.