ఆక్రమణకు గురవుతున్న చిలకవాగు కాలువ

ఆక్రమణకు గురవుతున్న చిలకవాగు కాలువ

VKB: తాండూరు పట్టణంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో చిలుకవాగు ఆక్రమణలకు గురై కొన్ని చోట్ల కాలువ రూపురేఖలు కోల్పోయింది. వర్షాలకు తాండూరు-హైదరాబాద్, తాండూరు-కోకట్ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీలు జలమయమై, ఇళ్లలోకి వరద చేరింది. చిలుకవాగు ఆక్రమణలే ఈ వరద సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.