టిప్పర్ లారీ ఢీ.. డ్రైవర్‌కు గాయాలు
BDK: భద్రాచలం బస్టాండ్ సమీపంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న పంచాయతీ ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొన్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కింద పడటంతో ఆయన కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు టిప్పర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.