ముస్తాబాద్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ
SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. ఓరగంటి విజయ అనే మహిళ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. శనివారం దుండగులు బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.