ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి

బాపట్ల: పంగులూరు మండలంలోని కోటపాడు, ముప్పవరం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు కోటపాడుకు చెందిన గోళ్ళమూడి అంజయ్య(50) రాత్రి ముప్పువరం నుంచి ట్రాక్టర్‌పై కోటపాడు బయలుదేరాడు. ఆదిరెడ్డి బావి సమీపంలో మలుపు దగ్గరకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌పై ఉన్న అంజయ్య అక్కడిక్కక్కడే చనిపోయాడు.