శ్రీశైలానికి భారీగా పోటెత్తిన భక్తులు
NDL: శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలో రెండో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి స్వామి అమ్మవార్లను భృంగి వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఆలయ కార్యవర్గ సభ్యులు తెలిపారు.