క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలి: సోనూసూద్

దేశవ్యాప్తంగా ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలను అందిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమాలు వదులుకుని తెలుగు సినిమాలు చేయడానికి తాను సిద్ధమని, ఈ ప్రాంతంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు చాలా గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.