సాలిపేటలో బంగారు వస్తువులు చోరీ

సాలిపేటలో బంగారు వస్తువులు చోరీ

VZM: గజపతినగరం మండలంలోని సాలిపేట గ్రామంలో రొంగలి శంకర్రావు ఇంట్లో బీరువా తలుపులు పగలగొట్టి సుమారు మూడు తులాల బంగారు వస్తువులు అపహరణకు గురైనట్లు గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు గురువారం తెలిపారు. ఈనెల 15వ తేదీన తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్ళగా, మధ్యాహ్నం 12 గంటలకు భార్య పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగిందన్నారు.