VIDEO: వైద్య కళాశాలపై వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సవాల్
KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నిన్న రాత్రి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైద్య కళాశాలల విషయంలో CM చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, అయితే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయకుండానే కళాశాలలకు శంకుస్థాపనలు చేశారని, కోటి సంతకాలతో ఏం చేస్తారని ప్రశ్నించారు.