'విజయవాడలో ప్రతిష్ట బందోబస్తు'

ఎన్టీఆర్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ దామోదర్ ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... స్టేడియంకు వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 450 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.