జమ్మికుంట మార్కెట్‌లో స్థిరంగా పత్తి గరిష్ట ధర
KNR: గడిచిన మూడు రోజులుగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు నిలకడగా కొనసాగుతుండటం విశేషం. ఈ వారం ఆరంభం నుంచి గరిష్ట ధర రూ. 8,000 మార్కుపైనే నిలకడగా కొనసాగుతూ వస్తోంది. గురువారం నాడు కూడా గరిష్టంగా రూ. 8,050 ధర పలికింది. ఈ రోజు రైతులు 7 వాహనాల్లో 75 క్వింటాళ్ల విడి పత్తి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 8,050, కనిష్టంగా రూ. 6000 ధర పలికింది.