కిన్నెరసాని వాగు ఉద్ధృతం – ప్రజలకు ఇబ్బందులు
BDK: ఆళ్లపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం రాయిపాడు గ్రామ సమీపంలోని వంతెన వద్ద కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనదారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు లో లెవెల్ బ్రిడ్జి దాటాలంటే ప్రాణాలు పణంగా పెట్టుకోవాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.